Thandel Movie: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. మత్స్యకారుడిగా ఈ చిత్రంలో చైతూ కనిపించనున్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్‍గా చేస్తున్నారు. చిత్రీకరణ కంటే ముందే తండేల్ కోసం మూవీ యూనిట్ చాలా కసరత్తులు చేసింది. కాగా, ఇప్పుడు తండేల్ సినిమా షూటింగ్ మొదలైంది. ఆ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా వెల్లడించింది.