Home వీడియోస్ Heavy rush of pilgrims in Sabarimala | శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు

Heavy rush of pilgrims in Sabarimala | శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు

0

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇడుముడి సమర్పించేందుకు సమయం దగ్గర పడుతుండడంతో మరింత మంది భక్తులు వస్తున్నారు. దీంతో శబరిమల ప్రాంతం కిక్కిరిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ నుంచి భక్తుల రాక భారీగా ఉంది. రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు, అయ్యప్ప మాలాధారులు స్వామివారిని దర్శించుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఎరుమేలిలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు, స్వాములు కాలినడకనే శబరిమలకు వెళ్తున్నారు.

Exit mobile version