ద్వారక అద్భుత ఘట్టానికి వేదికైంది. వేలాది మంది మహిళలు ఒకేచోట సంప్రదాయ నృత్యం చేసి ఔరా అనిపించారు. వేయి రెండువేలు కాదు ఏకంగా 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి డ్రోన్లు కెమెరాల్లో బంధించాయి.