ఏ పార్టీలో ఎవరూ శాశ్వతం కాదు?
2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీ చేరిన జ్యోతుల చంటిబాబుకు…జగన్ జగ్గంపేట టికెట్ కేటాయించారు. దీంతో ఆ ఎన్నికల్లో చంటిబాబు జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ డౌటే అని తెలియడంతో.. చంటిబాబు మళ్లీ టీడీపీ చేరేందుకు రెడీ అవుతున్నారట. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు బంధువులు. జగ్గంపేటలో తన కుటుంబానికి చెందిన వారే ఎమ్మెల్యేగా ఉండాలని, బయట వ్యక్తులు మద్దతు ఇవ్వలేమని జ్యోతుల చంటిబాబు తన అనుచరులతో అన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే చంటిబాబు… ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మేం ఏమైనా ఈ పార్టీలో శాశ్వతమా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో? ఎవరికి తెలుసు? ఏ పార్టీలో ఎవరూ శాశ్వతం కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే చంటిబాబు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి.