మంత్రుల పర్యటనలో లక్షలు వసూళ్లు
సాధారణంగా మంత్రులు, ఉన్నతాధికారులు మండల స్థాయిలో పర్యటిస్తే… ఆ ఖర్చులు కిందిస్థాయి అధికారులపై పడుతుంది. ఈ ఖర్చులు అధికారులు ఏదొక లెక్కల్లో చూపిస్తుంటారు. మంత్రులు, అధికారుల పర్యటనలతో నలిగిపోతున్నామని మడకశిర ఎమ్మార్వో ముర్షావలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లంచం లేనిదే పనిచేయనంటూ తెగేసి చెప్పారు. అధికారుల పర్యటనలతో ఖర్చు భారీగా అవుతుందని, వాటిని భరించలేకపోతున్నామన్నారు. మంత్రుల పర్యటన ముసుగులో లక్షలు వసూళ్లు చేస్తున్నారని ఆవేదన చెందారు.