ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ క్రేజియస్ట్ మూవీ ‘సలార్’ ప్రీమియర్ షో ఫ్యాన్సు చూసేశారు. హైదరాబాద్, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో థియేటర్ల వద్ద పడిగాపులు కాసి మరీ టికెట్లు కొనుగోలు చేశారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్, పృథ్వీరాజ్-సుకుమారన్ మధ్య బలమైన స్నేహ బంధాన్ని చూపిస్తూ అద్భుతమైన విజువల్స్ తో ఈ మూవీని యాక్షన్ డ్రామాగా తీశారు. ప్రభాస్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ఫ్యాన్స్ కోరుకునే అంశాలని డైరెక్టర్ ప్రశాంత్ డెలివర్ చేశారు. యాక్షన్ ఎలివేషన్ సన్నివేశాల్లో ఫ్యాన్సును మరింత ఆకట్టుకున్నాయి. డైలాగులు కూడా పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. సెకండ్ హాఫ్ లో కథ పకడ్బందీగా సాగుతుంది.