ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద హైవేపై దూసుకెళ్తున్న కారు.. ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో భారీగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు, విచారణ చేస్తున్నారు.