Home వీడియోస్ AP News | టీడీపీ సభకు పవన్ వెళ్లారు.. జగన్ పుట్టిన రోజుకు నేను వచ్చా:...

AP News | టీడీపీ సభకు పవన్ వెళ్లారు.. జగన్ పుట్టిన రోజుకు నేను వచ్చా: జనసేన నేత

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నాయకుడు శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన పెద్ద మనిషి ఫంక్షన్ యువగళం సభకు పవన్ వెళ్లారని విమర్శించారు. పవన్ ఆ సభకు వెళ్లినందుకే.. తాను సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలకు వచ్చానని అన్నారు. చతికిల పడ్డ టీడీపీని పవన్ ఎందుకు భుజాన వేసుకుంటున్నాడని అడిగారు. అయితే ప్రస్తుతం వినుకొండ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ గా శ్రీనివాసరావు ఉన్నారు. జనసేన కండువా వేసుకొనే ఆ పార్టీ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించటం చర్చనీయాంశం అయ్యింది.

Exit mobile version