Friday, January 10, 2025
Prema Entha Madhuram December 21st Episode – ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: తాతని ఇంటికి తీసుకువచ్చి తల్లికి షాకిచ్చిన అభయ్, అక్కి – తండ్రి కూతుళ్లు కలుస్తారా!
Prema Entha Madhuram Telugu Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీరు ఇక్కడే ఉండండి పిల్లలు, నేను వెళ్లి మా కూతురు ఆల్బమ్ తీసుకొని వస్తాను అని పద్దు లోపలికి వెళ్లి ఆల్బమ్ తీసుకొని వస్తుంది.
పద్దు: ఇదిగో ఇవే మా అమ్మి చిన్నప్పటి ఫోటోలు అని చిన్నప్పటి ఫోటోలన్నీ చూపిస్తుంది. అందులో ఆర్య చిన్నప్పటి ఫోటో ఉంటుంది.
అభయ్: ఈయన ఎవరు? అని ఆర్య ఫోటోని చూపిస్తూ అడుగుతాడు
సుబ్బు: ఆయనే మా అల్లుడుగారు అని అనగానే పిల్లలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.
అక్కి: ఆయన ఫోటో లేదా మరి?
పద్దు: ఎందుకు లేదు తర్వాత ఉన్నవన్నీ పెళ్లి ఫోటోలే అని ఆర్య, అనుల పెళ్లి ఫోటోలు చూపిస్తుంది పద్దు. అది చూసిన వెంటనే పిల్లలు ఇద్దరు షాక్ అయ్యి ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు. ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆర్య ఫోటో మీద చేయి పెడుతూ బాధపడతారు ఇద్దరూ.
సుబ్బు: ఈయనే మా అల్లుడుగారు. ఆర్య వర్ధన్ అని పెద్ద బిజినెస్ మాన్. చాలా మంచి వాళ్ళు ఎప్పుడూ అందరికీ సహాయం చేస్తూనే ఉంటారు, మీలాగా. దేవుడితోనే సమానం
అక్కి: మరి అమ్మ ఎందుకు నాన్నకు అంత దూరంగా ఉంటుంది? అని మనసులో అనుకుంటుంది.
అభయ్: అంత మంచి మనిషి అయినప్పుడు ఎందుకు మీ కూతురు దూరంగా ఉంటుంది?
సుబ్బు: అది తలరాతలో రాసి ఉంది. అయినా మేము తనకోసం వెతకని ప్రదేశం అంటూ లేదు ఇంకా ఆ దేవుడిపైనే భారం వేసేసాము అని అనగా వెంటనే పిల్లలు పద్ధుని హద్దుకుంటూ అమ్మమ్మ అని అంటారు.
అక్కి: ఎందుకు అలా చూస్తున్నావ్ నేను నిన్ను అమ్మమ్మ అని పిలవకూడదా?
పద్దు: ఎందుకు పిలవకూడదు అలాగే పిలవండి. మా అమ్మి నన్ను అమ్మ అని పిలిస్తే ఎంత ఆనందం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఆనందం వస్తుంది మీరు నన్ను అమ్మమ్మ అని పిలిస్తే. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండండి.
అభయ్: సరే మేము ఇంక ఇంటికి బయలుదేరుతాము తాతయ్య
అక్కి: తాతయ్య మీరు పడిపోతే మేము తీసుకొని వచ్చాం కదా అలాగే మమ్మల్ని కూడా మా ఇంట్లో దింపండి.
అభయ్: అదేమీ వద్దులేండి తాతయ్య.. మేం వెళ్ళిపోతాం అని అంటాడు. అప్పుడు అక్కి అభయ్ చెవిలో ఇలా అంటుంది.
అక్కి: అన్నయ్య ఇప్పుడు తాతయ్యని మన ఇంటికి తీసుకొని వచ్చామనుకో.. అప్పుడు అమ్మ తాతయ్య కలిసిపోతారు. అప్పుడు తాతయ్య అమ్మని నాన్నని కలపడానికి ట్రై చేస్తారు. ఈ విధంగా మనం ప్రామిస్ బ్రేక్ చేసినట్టు కూడా ఉండదు కదా!
అభయ్: గుడ్ ఐడియా అక్కి
అభయ్: తాతయ్య మేము మిమ్మల్ని కాపాడడానికి స్కూలుకి వెళ్ళలేదు అంటే మా అమ్మ నమ్మదు. అందుకే మీరే వచ్చి చెప్పండి లేకపోతే మమ్మల్ని తిడతాది అని అనగా సరే అని చెప్పి సుబ్బు వాళ్ళిద్దర్నీ దింపడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటి దగ్గరికి వస్తున్నప్పుడు మాల వేసుకున్న ఒక మనిషి సుబ్బు ని పలకరిస్తాడు.
అభయ్: తాతయ్య ఈ అయ్యప్ప మాల వేసుకుంటే కోరినది ఏదైనా తీరుతుందా?
సుబ్బు: కచ్చితంగా తీరుతుంది కానీ కోరికలు తీరాలి అని మనం మాల వేసుకోకూడదు, భక్తి కోసం వేసుకోవాలి.
అక్కి: ఇంకా చెప్పు తాతయ్య దీని గురించి అని అక్కి అంటుంది. మరో వైపు వీళ్ళ ముగ్గురు ఇంటిముందు మాట్లాడుకోవడాన్ని అను చూసి షాక్ అవుతుంది.
అను: అదేంటి నాన్న వీళ్ళిద్దరితో ఉన్నారు? అంటే నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిపోయిందా? ఎలా తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది అను. ఇంతలో పిల్లలు ఇద్దరు సుబ్బుని ఇంటి లోపలికి తీసుకొని వస్తారు.
సుగుణ: అదేంటి పిల్లలు మీరు ఇంకా స్కూల్ కి వెళ్లలేదా?
సుబ్బు: నేను దారిలో కళ్ళు తిరిగి పడిపోతే పిల్లలే నన్ను ఇంటికి తీసుకొని వచ్చారు అందువల్లే వీళ్ళు స్కూల్ కి వెళ్ళలేకపోయారు. నన్ను క్షమించండి.
సుగుణ: అయ్యో పర్లేదు మంచి చేస్తే క్షమించమని అడగడం ఎందుకు? అని చెప్పి సుబ్బు ని కూర్చోపెట్టి తన పిల్లలందరినీ పరిచయం చేస్తుంది సుగుణ.
సుబ్బు: ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఉండే హడావిడే వేరు అని అనుతో తను గడిపిన క్షణాలను గుర్తుతెచ్చుకుంటూ చెప్తాడు సుబ్బు.
సుగుణ: నిజమే ఆడపిల్లలు ఉంటే ఉండే కలే వేరు. నాకు ఈ ముగ్గురితో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు. బయటకు వెళ్ళాడు ఈ పాటికి వచ్చేయాలి.
సుబ్బు: పిల్లల్ని క్షేమంగా దింపడానికి వచ్చాను. ఇంక నేను బయలుదేరుతాను.
అభయ్: ఆగండి తాతయ్య, మా అమ్మని కూడా మీకు పరిచయం చేస్తాను అని వెంటనే అభయ్, అక్కిలు అను ఉండే గదిలోకి అనుని పిలవడానికి వెళ్తారు. కానీ అక్కడ అను ఉండదు. ఇల్లంతా వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడ అను కనిపించదు. మరోవైపు అను మంచం వెనుకను దాక్కొని పిల్లలకు కనిపించకుండా ఉంటుంది.
అక్కి: అమ్మని పరిచయం చేద్దాం అనుకున్నాము కానీ అమ్మా ఎక్కడ కనిపించడం లేదు తాతయ్య అని అంటారు.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Related Articles
Stay Connected
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img
Telangana