Krishna Mukunda Murari Telugu Serial Today Episode : కృష్ణను మురారి తన ఇంటికి రమ్మని పిలుస్తాడు. భవానిని కూడా ఒప్పించాను అని చెప్తాడు. అయితే అందుకు కృష్ణ ఒప్పుకోదు. రానంటే రాను అనేస్తుంది. ముకుంద గురించి ఆలోచిస్తూ రాను అని చెప్పడంతో మురారి సీరియస్ అవుతాడు. ఎప్పుడు ముకుంద గురించి ఎందుకు అని అరుస్తాడు. దీంతో కృష్ణ నేను అక్కడికి వస్తే ముకుంద ఎప్పుడూ నా గురించే ఆలోచిస్తుంది. పెద్దత్తయ్యకు లేనిపోనివి చెప్పి రాద్ధాంతం చేస్తుందని మురారితో కృష్ణ చెప్తుంది.
కృష్ణ: ముకుంద మన ఇద్దరిని దూరం చేయదు అని గ్యారెంటీ ఏంటి. మా చిన్నమ్మ బాధ పడింది అనో.. అత్తయ్య పిలిచింది అనో నేను అక్కడికి వచ్చి నా జీవితాన్ని నాశనం చేసుకోలేను ఏసీపీ సార్.. చెప్పాను కదా అసలే ముకుంద మానసిక స్థితి బాలేదు. ఏవో పిచ్చి మాటలు చెప్తే మనకే ఇబ్బంది కదా.
మురారి: పిచ్చి మాటలు పెద్దమ్మ నమ్ముదు కదా..
కృష్ణ: ముకుంద ఎలా చెప్పినా.. పిచ్చినా చెప్పినా పెద్దత్తయ్య నమ్మే స్థితిలో ఉంది. అందుకే నా మాట వినండి..
మురారి: సరే శేఖర్ గురించి తెలుసుకుంటూనే ఆదర్శ కోసం కూడా తెలుసుకుందాం.
కృష్ణ: అప్పుడు మనకు ఆటంకాలు ఏమీ ఉండవు. ఎవరూ మాట్లాడుకోరు కూడా. (ఇక శకుంతల అక్కడికి వస్తే మురారి పొయ్యి మీద పాలు పెట్టారు వెళ్లండి అని పంపేస్తాడు. అప్పుడే మురారి కృష్ణకు తెలీకుండా ముద్దు పెట్టేస్తాడు. దీంతో కృష్ణ తెగ సిగ్గు పడిపోతుంది.)
శకుంతల: మళ్లీ వచ్చి.. బిడ్డ నీ ఆరోగ్యం మంచిగా ఉందా అని మురారిని అడుగుతుంది. మరి ఎందుకు పొయ్యి మీద పాలు పెట్టకపోయినా పెట్టావు అని నన్ను పంపించావు. దీంతో కృష్ణ, మురారిలు ఇద్దరూ నవ్వుకుంటారు.
రేవతి: మనసులో.. మురారి కృష్ణను తీసుకొస్తా అని వెళ్లాడు. అక్కయ్యని కూడా ఒప్పించాడు. మరి అక్కయ్య కృష్ణ వస్తే ఎంత రచ్చ చేస్తుందో ఏంటో. ఏం జరుగుతుందో. అక్క మురారి కృష్ణని తీసుకొస్తా అని వెళ్లాడు మీరు ఏం అనకుండా ఉంటే బాగున్ను.
భవాని: నా సంగతి అటు ఉంచు రేవతి. అసలు మురారి వాళ్లు ఏం చెప్పారు ఈకేసు తేలే వరకు విడిగా ఉంటాము అన్నారు కదా.. ఆ కృష్ణ మన కిచెన్‌లో అడుగు పెట్టను అని అంది కదా ఇప్పుడు ఎలా వస్తుంది. అంటే వాళ్లు ఈ కేసు వెనుకు ఉంది పెద్దపల్లి ప్రభాకర్ అని ఫిక్స్ అయినట్లే కదా.. వాళ్ల ఛాలెంజ్‌లు అన్నీ ఏమయ్యాయి రేవతి.
రేవతి: మురారి కృష్ణ ఏదిరా..
మురారి: కృష్ణ నా భార్య అవ్వడం నిజంగా నా అదృష్టం అమ్మ. నా కళ్లు తెరిపించింది. నిజమే నేను పెద్దమ్మకి ఇచ్చిన మాట ఏంటి మేం భార్యాభర్తలుగా ఉండం అని. అవన్నీ పక్కన పెట్టి నేను తనని రమ్మని పిలవడానికి వెళ్లడం ఏంటి.. ముకుంద జీవితం ఒక దారిన చేసే వరకు రాను అని కృష్ణ చెప్పింది. అందుకే ఈ కేసు తేలే వరకు ఇంకేం మాట్లాడొద్దుని పంపించింది. కృష్ణ చెప్పినట్లు ముకుంద జీవితం..
భవాని: ఆపుతావా మురారి. ముకుంద జీవితాన్ని ఒక దారికి తీసుకురావడానికి అసలు తను ఎవరు. మనమంతా లేమా. ముకుంద జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు మీరు ఎవరూ ఏం ఆలోచించాల్సిన పనిలేదు.
ఇక శకుంతల తన అల్లుడికి ఏం మాయమాటలు చెప్పి పంపించావ్ అని కృష్ణని అడుగుతుంది. అప్పుడే రేవతి కూడా అక్కడికి వచ్చి అదే అడుగుతుంది. ఇక కృష్ణ అయితే తాను రాను రాను పెద్దత్తయ్యలా మారిపోతున్నాను అంటుంది. ఇక పెద్దత్తయ్యని నమ్మించే వాళ్లు ఎవరూ లేరు అని కృష్ణ అంటుంది.
కృష్ణ: అసలు ఆదర్శ్‌ని తీసుకొస్తే ఎలాంటి గొడవలు ఉండవు. ఈలోపు శేఖర్ ఎవరో గానీ తొందరగా పట్టుపడితే మనందరి జీవితాలు బాగుపడతాయి.
రేవతి: అవును కృష్ణ మరి ఆ శేఖర్ ఎందుకు ఇంత పని చేశాడు. ఏం ఆశించి చేశాడు.
మరోవైపు దేవ్ దగ్గరకు ముకుంద వస్తుంది. ఇక ముకుంద తన తండ్రి గురించి అడుగుతుంది. ఊరు పంపించేశాను అని దేవ్ అంటాడు. ఇక దేవ్ తన తండ్రి గురించి తిడితే ముకుంద నా ముందు నాన్నని తిట్టకు అని అంటుంది.
దేవ్: రేపు నేను మీ ఇంటికి వస్తాను.
ముకుంద: ఏయ్ వద్దు.
దేవ్: ఏం పర్లేదు.. మురారి షాక్‌లో ఉన్నప్పుడే నన్ను చూశాడు. నన్ను గుర్తుపట్టే అవకాశమే లేదు.
ముకుంద: వచ్చి ఏం చేస్తావ్.
దేవ్: చూస్తావు కదా సినిమా..
ముకుంద: వద్దు దేవ్ నాకు భయం వేస్తుంది.
దేవ్: సరే అయితే నువ్వు ఒక్క దానివే పోరాడి మురారిని పెళ్లి చేసుకుంటావా మరి.. అందుకే నేను వస్తా చక్రం తిప్పుతా.. వెళ్లు మళ్లీ ఈ టైంలో ఎక్కడికి వెళ్లావని అడుగుతారు.
ముకుంద: దేవ్ మా పెళ్లి అవుతుంది కదా..
మరోవైపు ముకుంద దొంగచాటుగా రావడం కృష్ణ చూస్తుంది. ఎందుకు ఇలా వెళ్లి వచ్చిందని ఆలోచిస్తుంది. ఇంతలో భవాని చూసి ముకుందని ఆపుతుంది. ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని అడుగుతుంది. నాన్నతో మాట్లాడుదామని వెళ్లానని ముకుంద చెప్తుంది. ఎందుకు టెన్షన్‌గా ఉన్నావని భవాని అడుగుతుంది.
భవాని: చూడు ముకుంద అనుక్షణం నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇలాంటి టైంలో నువ్వు కనపడకపోతే ఎంత టెన్షన్‌గా ఉంటుందో ఆలోచించు.
ముకుంద: సారీ అత్తయ్య నా గురించి ఆలోచించడానికి మీరు ఉన్నారు. ఇక నేను ఎక్కడికి వెళ్లినా మీకు చెప్తే వెళ్తాను.
ఇక కృష్ణని దగ్గరకు మురారి వస్తాడు. మురారికి కాఫీ ఇస్తానని కృష్ణ అంటుంది. ఇక చాటుగా కృష్ణ గ్యాంగ్‌ వచ్చి మరి మాకో అని అడుగుతారు. కాఫీ, టిఫెన్ రెండూ కావాలని చెప్తారు. మరోవైపు ముకుంద టెన్షన్ పడుతుంటుంది. ఏం చేయలేకపోతున్నాను అని బాధపడుతుంది. మురారి కేసు భయటపెడితే భవాని అత్తయ్య కూడా దూరం అయిపోతుంది అని బాధ పడుతుంది. అప్పుడే భవాని కిందకి వస్తుంటుంది. భవానితో ముకుంద అందరూ కృష్ణ ఇంటికి వెళ్లారని ఏడుస్తూ చెప్తుంది. అందరూ తనని దూరం పెడుతున్నారని బాధపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.