Home Uncategorized Bigg Boss Winner Pallavi Prashant In Chanchalguda Jail: పల్లవి ప్రశాంత్ కు 14...

Bigg Boss Winner Pallavi Prashant In Chanchalguda Jail: పల్లవి ప్రశాంత్ కు 14 రోజుల రిమాండ్

0

<p>బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. నిన్న రాత్రి గజ్వేల్ లో అతణ్ని అరెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు… ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చి స్టేషన్ లో విచారించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో పోలీసులు ఈ అరెస్ట్ ను చూపించారు. సెలెబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదంటున్నారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఇంట్లో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ ను న్యాయమూర్తి విధించారు. ఆ ఆదేశాల మేరకు పల్లవి ప్రశాంత్ ను, అతని సోదరుడ్ని రాజును చంచల్ గూడ జైలుకు తరలించారు.</p>  

Exit mobile version