Monday, January 13, 2025
Salaar: ప్రభాస్ వల్లే ‘సలార్’కి ‘A’ సర్టిఫికేట్ వచ్చింది – ప్రశాంత్ నీల్
Salaar Director Prashanth Neel Latest Interview : కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ -పాన్ ఇండియా హీరో ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘సలార్’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది. డార్లింగ్ ఫాన్స్ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ దగ్గర పడటంతో మూవీ టీం రాజమౌళి తో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమారన్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించి అనేక విషయాలను పంచుకున్నారు.
ఇదే విషయం గురించి తాజా ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. “సలార్ ప్రివ్యూ అయ్యాక సెన్సార్ అధికారులు చాలా కట్స్ చెప్పారు. దానికి నాకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పాను. కానీ ప్రత్యేకంగా కొన్ని కట్స్ మాత్రం కథలోని ఫ్లోని దెబ్బతీస్తాయని భావించి.. ఏం చేద్దామని ప్రభాస్ ని అడిగితే సింపుల్ గా ‘A’ సర్టిఫికెట్ తీసుకోమని చెప్పాడు. దాంతో మరుక్షణం ఆలోచించకుండా కట్స్ వద్దని చెప్పేసాను. ఫలితంగా ‘U/A బదులు ‘A’ సర్టిఫికెట్ మాత్రమే వచ్చింది” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సలార్ లో తాను చూపించింది అవసరమైన రక్తపాతమే తప్ప బలవంతంగా ఇరికించిన హింస ఏమాత్రం కాదని, ఇందులో రొమాన్స్, సెక్స్, సెట్ సాంగ్స్ ఇవేమీ ఉండవని మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ నీల్.
ఇక ఇదే ఇంటర్వ్యూలో సినిమాలో ప్రభాస్ పోషించిన దేవా క్యారెక్టర్రైజేషన్ పై మాట్లాడిన ప్రశాంత్ నీల్,” ప్రభాస్ ముఖంలో ఒక అమాయకత్వం ఉంటుంది. అది తనలోని ఒక పసి కోణాన్ని చూపిస్తుంది. అలాగే ఒక సింహాన్ని కూడా చూపిస్తుంది. ఇదే కోవలో సలార్ సినిమాలో తాను చేసిన దేవా క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. అవసరమైతే కాళ్లు పట్టుకుంటాడు. లేదంటే తలకు కూడా నరుకుతాడు” అంటూ సింగిల్ లైన్ లో సలార్ లో ప్రభాస్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందనేది చెప్పాడు. దీంతో ప్రశాంత్ నీల్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read : <a title=”DJ టిల్లుని ఆడేసుకున్న మంచు మనోజ్ – నవ్వులు పూయిస్తున్న ‘ఉస్తాద్’ లేటెస్ట్ ప్రోమో!” href=”https://telugu.abplive.com/entertainment/cinema/manchu-manoj-siddhu-jonnalagadda-ustaad-latest-promo-out-134446″ target=”_blank” rel=”noopener”>DJ టిల్లుని ఆడేసుకున్న మంచు మనోజ్ – నవ్వులు పూయిస్తున్న ‘ఉస్తాద్’ లేటెస్ట్ ప్రోమో!
Related Articles
Stay Connected
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img
Telangana