Ravi Teja’s Eagle trailer out now, Watch Here: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle Movie). యంగ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన తాజా చిత్రమిది. ఇంతకు ముందు ఆయన దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ వచ్చింది. ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై రూపొందుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే…. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
ఈగల్… మాస్ మహారాజా విశ్వరూపం!
’తుపాకీ నుంచి వచ్చే బుల్లెట్ ఆగేది ఎప్పుడో తెలుసా? అది పట్టుకున్న వాడిని తాకినప్పుడు’ అని అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)తో నవదీప్ చెప్పే మాటతో ‘ఈగల్’ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజను తెరపై చూపించారు.
’విషం మింగుతాను. విశ్వం తిరుగుతాను. ఊపిరి ఆపుతాను. కాపలా అవుతాను. విధ్వంసం నేను. విధ్వంసాన్ని ఆపే వినాశం నేను’ అని రవితేజ డైలాగ్ చెబుతుండగా… వేర్వేరు ప్రదేశాల్లో దృశ్యాలను చూపించారు. ఓ పల్లె / గూడెంలో రవితేజ విగ్రహం ఎందుకు పెట్టారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
రవితేజ, కావ్యా థాపర్ మధ్య ప్రేమ కథను సైతం ‘ఈగల్’ ట్రైలర్‌లో చూపించారు. ‘గన్ అంటే అసహ్యం. బుల్లెట్ అంటే భయం’ అని చెప్పే అమ్మాయి… తుపాకీలతో స్నేహం చేసే వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది? ‘నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది’ అని ఎందుకు చెప్పింది?
అతడిని పట్టుకోవడం కోసం మావోయిస్టులు, పోలీసులు, ప్రభుత్వం నుంచి ఫారిన్ మాఫియా, టెర్రరిస్టుల వరకు అందరూ ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మార్గశిర మధ్యరాత్రి ఆ మొండి మోతుబరి చేసిన మారణ హోమం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ట్రయిలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తోంది. ట్రైలర్ మొత్తం మీద చివరిలో ‘ఆయుధంతో విధ్వంసం చేసే వాడు రాక్షసుడు. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు’ అని చెబుతూ సిగరెట్ కాల్చే సీన్ హైలైట్ !
బ్లాక్‌ బస్టర్ ‘ధమాకా’ తర్వాత రవితేజ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడంతో ‘ఈగల్’ (Eagle Telugu Movie) మీద మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి బరిలో జనవరి 13న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు.
వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధు బాల, అజయ్ ఘోష్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సుజిత్ కుమార్ కొల్లి, ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగాల, స్టైలిస్ట్ : రేఖ బొగ్గరపు, కూర్పు : కార్తీక్ ఘట్టమనేని, మాటలు : మణిబాబు కరణం, స్క్రీన్ ప్లే : కార్తీక్ ఘట్టమనేని – మణిబాబు కరణం, పాటలు : చైతన్య ప్రసాద్, రెహమాన్ & కళ్యాణ్ చక్రవర్తి, యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ & టోమెక్, సంగీతం : దవ్‌జాంద్ (Davzand), నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్, రచన & దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని.