We Love Bad Boys Telugu Movie: వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్… ఈ వర్డ్స్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీసిన ‘బిజినెస్ మేన్’. ఆ సినిమాలో ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’ అని ఓ స్పెషల్ సాంగ్ ఉంది. అప్పట్లో ఆ పాట మీద విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పాట గురించి ప్రస్తావన ఎందుకు అంటే… ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.
’వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’ సెన్సార్ పూర్తి
We Love Bad Boys movie censor completed: అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ, రోషిణి సహోట, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’. నూతన నిర్మాణ సంస్ధ బిఎమ్ క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి పప్పుల వరలక్ష్మి సమర్పణలో పప్పుల కనక దుర్గా రావు నిర్మిస్తున్నారు. రాజు రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించారు. సన్యు దవలగర్, వంశీకృష్ణ, సింధు విజయ్, విహారిక చౌదరి ఇతర ముఖ్య తారాగణం.
’వి లవ్ బ్యాడ్ బాయ్స్’ సినిమాను యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ‘కడుపుబ్బే ఎంటర్‌టైనర్‌’గా సినిమా తీశామని చిత్ర బృందం చెబుతోంది.
త్వరలో విడుదల తేదీ వెల్లడి!
We Love Bad Boys Movie Release Date: ‘వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’ నిర్మాత పప్పుల కనక దుర్గా రావు మాట్లాడుతూ ”పోసాని కృష్ణ మురళి, కాశీ విశ్వనాథ్, ఆలీ, సప్తగిరి, ’30 ఇయర్స్’ పృథ్వీ, శివా రెడ్డి, ‘భద్రం’, గీతా సింగ్ తదితరులు సైతం మా సినిమాలో నటించారు. భారీ తారాగణంతో తీసిన చిత్రమిది. కథ, కథనాల విషయానికి వస్తే… ఈతరం యువతీ యువకుల మనోభావాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఆద్యంతం నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ ఇది. ట్రెండీగా ఉంటుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కొందరు మమ్మల్ని ప్రశంసించారు. మా నిర్మాణ సంస్థకు ఈ సినిమా శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేస్తాం” అని చెప్పారు.
’వుయ్ లవ్ బ్యాడ్ బాయ్స్’ చిత్రానికి రఘు కుంచెతో కలిసి భూషణ్ జాన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవి కుమార్ – శ్రీమన్నారాయణాచార్య (విరాట్) గానం: రఘు కుంచె – గీతా మాధురి – లిప్సిక – అరుణ్ కౌండిన్య – మనోజ్ శర్మ కుచి, కూర్పు: నందమూరి హరి, అడిషనల్ స్క్రీన్ ప్లే & మాటలు: ఆనంద్ కొడవటిగంటి, ఛాయాగ్రహణం: వి.కె. రామరాజు, సమర్పణ: శ్రీమతి పప్పుల వరలక్ష్మి, నిర్మాత: పప్పుల కనకదుర్గారావు, నిర్మాణం: బిఎమ్ క్రియేషన్స్, రచన – దర్శకత్వం: రాజు రాజేంద్రప్రసాద్.