తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల మీటింగ్‌కు అంతా రెడీ – ఎప్పుడు కలుస్తారంటే?
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య మర్యాదపూర్వక భేటీలు మొదలు అయ్యాయి. ఇటు సినిమా ఇండస్ట్రీ, అటు గవర్నమెంట్ మధ్య అగ్ర నిర్మాత ‘దిల్’ రాజు (Dil Raju) వారధిగా వ్యవహరిస్తున్నట్లు అర్థం అవుతోంది. సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దలు, 24 శాఖలకు చెందిన వివిధ సభ్యులు కొందరు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి <a title=”రేవంత్ రెడ్డి” href=”https://telugu.abplive.com/topic/Revanth-Reddy” data-type=”interlinkingkeywords”>రేవంత్ రెడ్డిని ఈ నెల 21తో (గురువారం) తెలుగు చిత్రసీమ పెద్దలు భేటీ కానున్నారని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఆ భేటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా జాయిన్ కానున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, ‘హనుమాన్’ ట్రైలర్‌తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్!
దర్శకుడు ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘హనుమాన్’. టాలీవుడ్ లో ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా రూపొందుతోంది. క్యూట్ బ్యూటీ అమృతా అయ్యర్ ఈ చిత్రంలో హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సింగిల్స్ అలరించాయి. ‘హనుమాన్’ ఆంథమ్‌, ‘ఆవ‌కాయ.. ఆంజ‌నేయ‌..’ అనే పాట సైతం అభిమానులకు బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘సలార్’ వర్సెస్ ‘డంకీ’ – ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఎవరిది పైచేయి?
రెండు ప్యాన్ ఇండియా చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తే.. ఒక్కొక్కసారి రెండిటికీ సరిపడా కలెక్షన్స్ రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ప్యాన్ ఇండియా చిత్రాలకు కనీసం రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ‘డంకీ’, ‘సలార్’ విషయంలో అలా జరగడం లేదు. కేవలం ఒకే రోజు గ్యాప్‌లో ఈ రెండు సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ‘సలార్ వర్సెస్ డంకీ’ పోటీ మొదలయ్యింది. అందుకే వీటి ప్రీ రిలీజ్ బిజినెస్‌పై ఫ్యాన్స్ దృష్టిపెట్టారు. ఏ సినిమా గొప్ప? ఏ హీరో గొప్ప? అని చర్చలు మొదలుపెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ఆహాలోకి తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ – స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
కీడా కోలా’ సినిమాను డిసెంబర్ 29న విడుదల చేయనున్నట్లు ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఇప్పటికే ఆహా ఈ చిత్రానికి సంబంధించిన నిన్న(డిసెంబర్ 18)న ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. “ఈ సీసాలో ఏదో క్రేజీగా ఉంది. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు త్వరలో వస్తోంది. ‘కీడా కోలా’ రిలీజ్ డేట్ రేపు ప్రకటిస్తాం” అని తెలిపింది. అన్నట్లుగానే ఈ రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కథ చెప్పగానే కౌగిలించుకున్నారు – రజనీ సినిమా గురించి లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలతో కనీవినీ ఎరుగని విజయాలను అందుకున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. యాక్షన్‌, ఎమోషనల్‌ కథాంశాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపారు. రీసెంట్ గా విజయ్ దళపతితో కలిసి ‘లియో‘ అనే సినిమా చేశారు. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. తాజాగా ఆయన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ‘తలైవా 171’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)