- 10వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
- మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అల్లాపూర్ జ్యోతి శ్రీకాంత్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. పట్టణంలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి తీరుతుందని ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అల్లాపూర్ జ్యోతి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆమె తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. వార్డు ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న నమ్మకం తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని పేర్కొన్నారు. 10వ వార్డు అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ఆ వెనుకబాటుతనాన్ని పారద్రోలి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.వార్డులో ఇంటింటికి తిరిగి సమస్యలను తెలుసుకుంటున్నామని, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జ్యోతి శ్రీకాంత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఈ ఎన్నికల్లో 10వ వార్డులో కాంగ్రెస్ పాగా వేయడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.






