- అట్టహాసంగా బుయ్యని సరళా రెడ్డి జన్మదిన వేడుకలు
- శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ ఛైర్పర్సన్, కౌన్సిలర్ల
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం పట్టణంలో ఘనంగా జరిగాయి. తాండూరులోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు రాజకీయ ప్రముఖులు, అభిమానులు భారీగా తరలివచ్చారు.ఈ సందర్భంగా తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతులు మరియు పట్టణ కౌన్సిలర్లు సరళా రెడ్డిని కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి, పూలమాలలు వేసి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సరళా రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఉదయం నుంచే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆర్బీఓఎల్ సంస్థ సిబ్బంది మరియు మహిళా నేతలు పెద్ద ఎత్తున తరలిరావడంతో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసం కోలాహలంగా మారింది. వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వేడుకల్లో సరళా రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.



