- సెంట్ మేరీస్ పాఠశాలలో మిన్నంటిన ‘బాలికా, ఓటర్ల’ దినోత్సవ వేడుకలు
- ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థుల స్కిట్ అమోఘం
- బాలికల రక్షణ అందరి బాధ్యత: పాఠశాల యాజమాన్యం
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం లోని సెంట్ మేరీస్ పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం మరియు జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభతో సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధం
ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ‘ఓటు-చైతన్యం’ స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓటును అమ్ముకోకూడదని, సరైన నాయకుడిని ఎన్నుకోవడం ద్వారానే దేశ భవిష్యత్తు మారుతుందని విద్యార్థులు తమ నటనతో కళ్లకు కట్టారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కు నమోదుపై వారు చేసిన ప్రసంగాలు పౌర బాధ్యతను గుర్తు చేశాయి.
ఆడపిల్లల రక్షణే లక్ష్యం
బాలికాల దినోత్సవ వేడుకల్లో భాగంగా సమాజంలో బాలికలపై జరుగుతున్న అక్రమాలు, వేధింపుల పట్ల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆడపిల్లల పట్ల వివక్ష చూపకుండా, వారికి సమాన అవకాశాలు కల్పించాలని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. బాలికలు ధైర్యంగా అక్రమాలను ఎదిరించాలని, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో పాఠశాల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.






