Wednesday, April 1, 2026

సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన….!

-

  • తాండూరు అభివృద్ధికి ‘మహర్దశ’..
  •  రూ. 289 కోట్లతో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం!
  • వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన
  • కోకట్ వాగుపై హైలెవల్ బ్రిడ్జి కల సాకారం: కరణం పురుషోత్తం రావు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చే విధంగా భారీ నిధులు మంజూరయ్యాయి. సుమారు రూ. 289 కోట్ల వ్యయంతో 102.9 కిలోమీటర్ల మేర బి.టి రోడ్ల అభివృద్ధి మరియు బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్త కరణం పురుషోత్తం రావు మంగళవారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. హెచ్ ఏ ఎం స్కీమ్ ద్వారా నిధులుప్రభుత్వం విడుదల చేసిన G.O.Ms. 70 ప్రకారం.. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ స్కీమ్ కింద మొత్తం 6 ప్రధాన రోడ్ల పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కోకట్ వాగు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి మరియు డివైడర్ పనులకు రూ. 63 కోట్లు మంజూరు కావడం విశేషం మని తెలిపారు. ఈ సందర్బంగా  ….తాండూర్ టూ కోటపల్లి   రోడ్డు  (25.42 కి.మీ) : రూ. 74.71 కోట్లు, కోకట్ వాగు హైలెవల్ బ్రిడ్జి & డివైడర్ రోడ్డు : రూ. 63.00 కోట్లు, లక్ష్మీనారాయణపూర్ – దేవనూర్ రోడ్డు (12 కి.మీ) : రూ. 41.31 కోట్లు, బుద్ధారం – ఇందూర్ రోడ్డు (15 కి.మీ) : రూ. 41.20 కోట్లు, మల్కాపల్లి – మదన్ తాపూర్ రోడ్డు (13 కి.మీ) : రూ. 35.71 కోట్లు, తాండూరు – తరిగోప్పుల రోడ్డు (23.68 కి.మీ) : రూ. 33.14 కోట్లు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని పురుషోత్తం రావు తెలిపారు. మే నెల నుండే పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రికి,   R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ప్రభుత్వ చీఫ్ విప్ డా. పి. మహేందర్ రెడ్డికి,  స్థానిక ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories