Thursday, April 2, 2026

సాయిపూర్‌లో గులాబీ జోరు…!

-

  • కారు గుర్తుకు ఓటు వేసి.. భారీ మెజారిటీతో గెలిపించండి
  • సాయిపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
  • ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం: పట్లోళ్ల దీప, నర్సింహులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పురపాలక పరిధిలోని 9, 10వ వార్డుల్లో ఎన్నికల సందడి నెలకొంది. సాయిపూర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థులు పట్లోళ్ల దీప,పట్లోళ్ల నర్సింహులు చైర్మన్ అభ్యర్థి బుధవారం ఉధృతస్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కాలనీ వాసుల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాండూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, అదే స్ఫూర్తితో 9, 10వ వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మురుగు కాలువలు, సిసి రోడ్లు మరియు తాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తమను గెలిపిస్తే, వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.అభ్యర్థులు ప్రచారానికి రాగా, కాలనీ వాసుల నుంచి అభ్యర్థులకు విశేష స్పందన లభించింది. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయని, తమ మద్దతు కారు గుర్తుకేనని ప్రజలు స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
spot_img

Related Stories