Saturday, January 31, 2026
Home NEWS సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలు

సమ్మక్క-సారలమ్మ ఉత్సవాలు

0
0
  • సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
  • పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

జనవాహిని ప్రతినిధి శంకర్పల్లి : శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలో త్వరలో నిర్వహించనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను (పోస్టర్) మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతర ఉత్సాహ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల నమ్మకానికి ప్రతీకగా నిలిచే వనదేవతల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి గౌడ్, ఈవో మారుతి రావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బసవయ్య, కమిటీ సభ్యులు మ్యాకల కుమార్ మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here