Wednesday, March 25, 2026

శ్రీనన్న మీరన్న స్పందించండి…!

-

spot_img
spot_img
spot_img
  • బెల్ట్ షాపులను ఎత్తివేయాలి..! 
  • కౌన్సిలర్ నారా శ్రీలత శ్రీకాంత్ వినతి 
  • 16వ వార్డు ‘తెలుగు గడ్డ’లో బెల్ట్ షాపుపై పోరు
  •  శ్రీను అన్నకు వినతిపత్రం అందజేత

జనవాహిని ప్రతినిధి తాండూరు : పాత తాండూరు 16వ వార్డు పరిధిలోని తెలుగు గడ్డ ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ బెల్ట్ షాపును వెంటనే ఎత్తివేయాలని కోరుతూ స్థానిక వార్డు కౌన్సిలర్ నారా శ్రీలత శ్రీకాంత్ మంగళవారం కాంగ్రెస్ నాయకులు, ఆర్ బి ఓ ఎల్ అధినేత శ్రీనివాస్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను వివరించారు. అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా వార్డులో కొనసాగుతున్న బెల్ట్ షాపులను మూసివేయాలని ఎక్సైజ్ (ఆబ్కారీ) అధికారులకు, పోలీస్ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారుల కార్యాలయాల ముందు బైఠాయించి ధర్నాలు చేసినా, నిరసనలు తెలిపినా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం విడ్డూరమని మండిపడ్డారు.బెల్ట్ షాపుల్లో మద్యం సేవించి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటనలు ఉన్నాయని, కళ్లముందే అనర్థాలు జరుగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తెలుగు గడ్డ ప్రాంతంలోని బెల్ట్ షాపును తొలగించి స్థానిక మహిళలు, యువత భవిష్యత్తును కాపాడాలని వారు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories