NEWS

రెడ్డి ఘనపూర్ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం

  • బషీరాబాద్ మండలం రెడ్డి ఘనపూర్ వార్డు-2 ఏకగ్రీవం
  • కాంగ్రెస్ అభ్యర్థి నూరజహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నిక…! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా వికారాబాద్ జిల్లా, బషీరాబాద్ మండలంలోని రెడ్డి ఘనపూర్ గ్రామ పంచాయతీ వార్డు ఎన్నికల్లో ఏకగ్రీవం నమోదైంది. ఉపసంహరణ ప్రక్రియ అనంతరం, ఈ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన శ్రీమతి నూరజహాన్ బేగం మాత్రమే అభ్యర్థిగా మిగిలారు.  దీంతో, వార్డ్ నెం. 2 సభ్యురాలిగా నూరజహాన్ బేగం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధృవీకరించారు. ఈ సందర్భంగా, గ్రామ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు నూరజహాన్ బేగంను అభినందించారు. రెడ్డి ఘనపూర్ గ్రామ అభివృద్ధికి పాటుపడతానని నూరజహాన్ బేగం ఈ సందర్భంగా తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

You cannot copy content of this page

error: Content is protected !!