Wednesday, March 11, 2026
spot_img

రామాలయానికి ఎమ్మెల్యే విరాళం…!

-

spot_img
spot_img
  • శ్రీరామ మందిర పునఃప్రతిష్టాపనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
  • రూ. లక్ష విరాళం ప్రకటించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇంద్ర నగర్ శ్రీ రామ మందిర పునర్నిర్మాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెలలో నిర్వహించ తలపెట్టిన విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు బుధవారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆలయ పునఃప్రతిష్టాపన మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అనంతరం 27వ తేదీన శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఐదు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోలాహలంగా సాగనున్నాయి.ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కార్యక్రమానికి తప్పక హాజరవుతానని తెలిపారు. అంతేకాకుండా, ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయలను ప్రకటించి తన భక్తిని చాటుకున్నారు.పట్టణంలోని ఏకైక రామ మందిర పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. భక్తులందరూ ఈ ఐదు రోజుల వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories