- మురళి గౌడ్ మున్సిపల్ పోటీకి గుడ్ బై?
- జెడ్పీ పీఠం దిశగా మురళి గౌడ్ అడుగులు?
- మున్సిపల్ ఎన్నికల వేళ మారుతున్న సమీకరణాలు – మురళి గౌడ్ పోటీపై క్లారిటీ!
జనవాహిని ప్రతినిధి తాండూరు : గత 15 రోజులుగా మున్సిపల్ ఎన్నికల హడావిడి ప్రారంభమైనప్పటి నుండి ప్రధాన చర్చల్లో భాగంగా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్ కచ్చితంగా పోటీలో ఉంటారని చర్చ జరిగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న మురళి గౌడ్ పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు ఆదరణ చూపే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు వినిపించినాయి. ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు నుండి మురళి గౌడ్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వచ్చారు. చైర్మన్ పోటీ విషయమై తాను ఇలాంటి ప్రకటన చేయలేదు. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ ఆయన పెద్దగా పాల్గొనలేదు. అయినప్పటికీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కేవలం మురళి గౌడ్ ని దృష్టిలో ఉంచుకొని చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడం లేదన్న వార్తలు కూడా ప్రధాన చర్చల్లో భాగంగా మారింది. ముఖ్యంగా విద్యావంతుడైన మురళి గౌడ్ పోటీలో ఉంటే తాండూర్ లో కాంగ్రెస్ కు లాభం అనే వాదన కూడా బలంగా వినిపించింది.గత ఐదు రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాల మధ్య డాక్టర్ సంపత్ కాంగ్రెస్ పార్టీ నుండి దూరంగా ఉంటూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో డాక్టర్ సంపత్ కుమార్ ను సస్పెన్షన్ చేస్తారంటూ ఒక వార్త.. లేదా డాక్టర్ సంపత్ రాజీనామా చేస్తానంటూ ఒక వార్త సోషల్ మీడియాలో షికార్లు కొట్టింది. ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి హైదరాబాద్ కేంద్రంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ ల మధ్య చర్చలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వార్త తాండూరులో విపరీతంగా ప్రచారం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా పలు సందర్భాలలో జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సంపత్ కుమార్ ఉంటారని అటు ఎమ్మెల్యే తో పాటు పార్టీ ఉన్నత వర్గాలు ధ్రువీకరించిన నేపథ్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వహాత్మకంగా డాక్టర్ విషయంలో సంయమనం పాటించారు. అయితే మున్సిపల్ ఎన్నికలవేళ డాక్టర్ వ్యవహార శైలి మరియు హైదరాబాదులో జరిగిన సీక్రెట్ సమావేశంలో జరిగిన చర్చలను దృష్టిలో ఉంచుకొని డాక్టర్ సంపత్ కుమార్ తో తెగదెంపులు చేసుకునేందుకే మనోహర్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డాక్టర్ సంపత్ కుమార్ కు చెక్ పెట్టేందుకుగాను వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా మురళి గౌడ్ పేరును అధిష్టానానికి ప్రతిపాదించేందుకు ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మరియు బిజెపిలో రాష్ట్రస్థాయి పదవిలో ఉన్న మురళి గౌడ్ కు జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం ఇచ్చేందుకు ఎమ్మెల్యే సానుకూలంగా ఉండడమే కాకుండా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల బరిలో నుండి మురళి గౌడ్ తప్పుకోవచ్చని సన్నిహితుల ద్వారా తెలిసింది. అంతేకాకుండా ఈ ప్రణాళికలో భాగంగానే మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి గౌడ్ వ్యూహత్మాకంగా మౌనం పాటించినట్టు తెలుస్తోంది






