Wednesday, February 4, 2026
Home NEWS మున్సిపల్ పోరులో జనసేన జోరు…!

మున్సిపల్ పోరులో జనసేన జోరు…!

0
143
  • అగనూరు అనితకు ఘన స్వాగతం
  • 1వ వార్డులో జనసేన గాలి
  • సిరి యాదవ్ వ్యూహం.. జనసేన విజయపథం
  • సిద్ధాంతాలే బలం – అభివృద్ధే లక్ష్యం…! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా 1వ వార్డులో జనసేన జోష్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన సిరి యాదవ్ కుటుంబ సభ్యురాలు అగనూరు అనితకు వార్డు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బుధవారం వార్డులో నిర్వహించిన ప్రచారం లో మహిళలు, యువత భారీ సంఖ్యలో తరలివచ్చి నీరాజనాలు పలికారు.స్థానికంగా బలమైన నాయకత్వం, సేవా కార్యక్రమాలతో గుర్తింపు పొందిన సిరి యాదవ్ వ్యూహాలు పార్టీకి ప్లస్ పాయింట్‌గా మారాయి. క్షేత్రస్థాయిలో అయనకున్న పట్టు, ప్రజలతో ఉన్న అనుబంధం జనసేనను గెలుపు తీరాలకు చేరుస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అనిత స్పష్టం చేశారు.ప్రచార హోరు ఒకవైపు కొనసాగుతుండగా, తాజా ‘హలో’ సర్వేలు జనసేన పార్టీకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తుండటంతో 1వ వార్డులో జనసేన జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వార్డులోని మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్య మెరుగుదల లక్ష్యంగా సాగుతున్న జనసేన ప్రచారం ఓటర్లను ఆకట్టుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here