Wednesday, February 4, 2026
Home NEWS మరోసారి హస్తం వైపు తాండూరు చూపు..!

మరోసారి హస్తం వైపు తాండూరు చూపు..!

0
135
  • ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీకే..
  • అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే ‘చేతి గుర్తు’కే ఓటేయాలి
  • ​35వ వార్డు ప్రచారంలో ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణంలోని 35వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 35వ వార్డు అభ్యర్థి అఫ్షామానియ నూర్ అహ్మద్, 2వ వార్డు అభ్యర్థి ప్రత్యుష మెహన్ తరుపున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత రెండేళ్లలో తాండూరు పట్టణ రూపురేఖలు మార్చడానికి రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ప్రధానంగా శివాజీ చౌక్ నుండి మల్రెడ్డి పల్లి వరకు రూ. 2 కోట్లతో నూతన రోడ్డు నిర్మించామన్నారు. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అమృత్ 2.0 పథకం కింద రూ. 27 కోట్లతో వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.గత పాలకులు వార్డుల సమస్యలను గాలికి వదిలేశారని, వర్గ పోరుతో మున్సిపల్ కౌన్సిల్‌ను సైతం సరిగ్గా నడపలేకపోయారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమ అభ్యర్థుల గెలుపుకు బ్రహ్మాస్త్రాలు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే సమక్షంలో 35వ వార్డుకు చెందిన పలువురు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారసింగ్, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీగౌడ్, మాజీ కౌన్సిలర్లు సర్దార్ ఖాన్, ఇక్బాల్, ప్రభాకర్ గౌడ్, భీంశంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here