- కాసేపట్లో మోగనున్న మున్సిపల్ నగారా
- ఈ మధ్యాహ్నం 3.45 గంటలకు నోటిఫికేషన్
జనవాహిని డెస్క్ : రాష్ట్రంలో కాసేపట్లో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మధ్యాహ్నం 3.45 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి మీడియా ప్రతినిధులకు ఇప్పటికే సమాచారం అందింది.మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు ఈ సమావేశంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి రానుంది. కాగా, ఇందులో భాగంగా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం.






