భోణి కొట్టిన ‘లక్ష్మీనారాయణపూర్ !

- సర్పంచ్ సహా వార్డు మెంబర్లు ఏకగ్రీవం
- సర్పంచ్ గా గుర్రాల నాగమణి నర్సిరెడ్డి
- ఇక వీరి ఎన్నిక లాంచనమే
జనవాహిని ప్రతినిధి తాండూరు : పంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాలాల మండలం లక్ష్మీనారాయణ పుర్ తాండూరు నియోజకవర్గం లోనే బోణి కొట్టింది.సర్పంచ్ తో సహా వార్డు మెంబర్ల స్థానాలకు గాను ఒక్కటే నామినేషన్లు దాఖలు కావడంతో ఇక వారి ఎన్నిక ఇక లాంచనప్రాయమే. సర్పంచ్ అభ్యర్థిగా గుర్రాల నాగమణి నర్సిరెడ్డి ని గ్రామస్తులంతా కలిసి పార్టీలకతీతంగా ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అదేవిధంగా వార్డు సభ్యులకు కూడా 8 మందిని ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. దీంతో వీరందరి ఎన్నిక లాంచన ప్రాయం కానుంది. నామినేషన్ల చివరి రోజు అయిన నేడు సర్పంచ్ అభ్యర్థిగా గుర్రాల నాగమణి నర్సిరెడ్డి తోపాటు 8 మంది వార్డు సభ్యులకు గాను అగ్గనూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గుర్రాల నాగమణి నర్సిరెడ్డి మాట్లాడుతూ తనతోపాటు 8 మంది వార్డు సభ్యుల అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన గ్రామస్తులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ వి రెడ్డి, సురేందర్ రెడ్డి, నాగమొల్ల, నర్సిరెడ్డి,శేఖర్ రెడ్డి, గుర్రాల నర్సిరెడ్డి, జైపాల్ రెడ్డి, నాగమొల్ల సురేందర్ రెడ్డి, కుర్వ అంజిలయ్య,నర్సింలు,జగదీష్, మహేష్ కాశప్ప,శ్రీనివాస్, రమేష్, నగేష్,దేవప్ప తదితరులు పాల్గొన్నారు.



