Tuesday, May 26, 2026

― Advertisement ―

సమ్మెకు మద్దతు తెలిపిన జావీద్…!

విఏఓ ల సమస్యలను పరిష్కరించండి ప్రభుత్వానికి కౌన్సిలర్ హెచ్చరిక విఏఓ లకు మద్దతు తెలిపిన జావీద్  జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమ్మెకు మద్దతుగా...
HomeNEWSభారీగా రేషన్ బియ్యం సీజ్.. 6 గురు అరెస్ట్..!

భారీగా రేషన్ బియ్యం సీజ్.. 6 గురు అరెస్ట్..!

spot_img
  • రేషన్ మాఫియా, జూదరుల ఆటకట్టించిన టాస్క్ ఫోర్స్
  •  కుల్కచర్లలో 34.5 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత.
  • స్కూల్ ఆవరణలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్.
  •  చట్టం అతిక్రమిస్తే జైలుకే: జిల్లా ఎస్పీ హెచ్చరిక.

జనవాహిని ప్రతినిధి తాండూరు : రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ అన్వర్ పాషా బృందం కుల్కచర్లలో రంగంలోకి దిగింది. నిందితులు అంగడి ప్రదీప్, ముగుద రవితేజ తమ ఇల్లు, దుకాణాల్లో దాచిన 69 బస్తాల (3,450 కిలోలు) బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. పక్కదారి పడుతున్న ప్రభుత్వ సొత్తును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదేవిదంగా….చదువుకోవాల్సిన పాఠశాల ఆవరణను పేకాట స్థావరంగా మార్చుకున్న ఆరుగురు కేటుగాళ్లపై పోలీసులు పంజా విసిరారు. తాండూరు పట్టణం లోని మాణిక్‌నగర్ ప్రైమరీ స్కూల్ ఆవరణలో జూదం ఆడుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి నెట్టారు.ఈ సందర్బంగా ఎస్పీ స్నేహ మెహ్ర మాట్లాడుతూ…. జిల్లాలో పేద ప్రజల హక్కులను కాలరాస్తూ రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, యువతను పెడదోవ పట్టించేలా జూదం వంటి కార్యకలాపాలు నిర్వహించినా ఉక్కుపాదం మోపుతమన్నారు. అసాంఘిక పనుల సమాచారాన్ని ప్రజలు 100 కి కాల్ చేసి పోలీసులకు చేరవేయాలని తెలిపారు.