బీసీ సమాజం ఈ దేశానికి వెన్నెముక – జాతీయ పతాక ఆవిష్కరణలో బీసీ నేత కందుకూరి రాజ్ కుమార్

- బీసీ సమాజం ఈ దేశానికి వెన్నెముక
- స్వతంత్రం వచ్చి ఏళ్ల గడిచిన సామాజిక సమానత్వం లేదు
- స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందాలి
- ఇంకా బీసీ సమాజం విద్య ఉద్యోగాలు రాజకీయాల్లో సరియైన స్థానం పొందలేదు
- జాతీయ పతాక ఆవిష్కరణలో బీసీ నేత కందుకూరి రాజ్ కుమార్
జానవాహిణి టీవీ తాండూర్ డెస్క్ :- భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు దాటిన సామాజిక సమానత్వం ఇంకా పూర్తిగా రాలేదని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని సర్దార్ పటేల్ చౌక్ నందు బీసీ సంఘం మరియు సర్దార్ పటేల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పథకావిష్కరణలో పాల్గొని జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు స్వతంత్రం కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు సామాజిక సమానత్వం ఆర్థిక న్యాయం. భారతదేశంలో బీసీలు దేశ ఆర్థిక సామాజిక నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు వ్యవసాయము వృత్తులు కళలు వాణిజం ఇవన్నీ బీసీల శక్తితోనే బలపడుతున్నాయి కానీ ఇంకా బీసీ సమాజం విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వెనుకబడింది రాజకీయ స్వతంత్రం వచ్చిన సామాజిక సమానత్వం ఇంకా సాధించవలసిందని అన్నారు బీసీలు బలపడితేనే దేశం బలపడుతుందని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా బీసీ సమాజం ఐక్యంగా ముందుకు సాగి రాబోవు తరాల కోసం బలమైన పునాది వేయాలని రాజ్ కుమార్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా జిల్లా మరియు నియోజకవర్గం నాయకులు నరసమ్మ, మంజుల, జగదీశ్వరి, సర్దార్ పటేల్ అసోసియేషన్ సభ్యులు, జోసఫ్, లింగం, రమేష్, అజయ్, రాయల్ రాజ్ , బజరంగ్దళ్ నాయకులు రజిని, గ్లోబల్ యువతరం నాయకులు అరుణ్ రాజ్, నాగేందర్, బీసీ సంఘం యువ నాయకులు బసవరాజ్, రామ ముదిరాజ్, దుబాయ్ వెంకట్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.



