- తాండూరులో కాంగ్రెస్, ఎంఐఎంకు షాక్
- బీఆర్ఎస్‌లోకి భారీ వలసలు!
- రోహిత్ రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి 100 మంది కార్యకర్తలు
- వార్డు అభివృద్ధి కోసం ఇర్షాద్ ఆధ్వర్యంలో చేరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పట్టణంలోని 7వ వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకున్నారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఇర్షాద్ ప్రత్యేక చొరవతో.. కాంగ్రెస్ మరియు ఎంఐఎం పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు మంగళవారం అధికారికంగా పార్టీలో చేరారు.మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నూతనంగా చేరిన కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల వారు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని కొనియాడారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఇర్షాద్ మాట్లాడుతూ.. వార్డ్ నెంబర్ 7 అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారందరూ కూడా వార్డు పురోభివృద్ధికి, ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడానికి నిబద్ధతతో పని చేస్తామని ప్రకటించారు. ఈ భారీ చేరికలతో 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడిందని, ప్రజల్లో పార్టీపై నమ్మకం రెట్టింపు అయిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






