Wednesday, February 25, 2026

బాల్ రెడ్డి కాదు బాలరాజు….! 

-

spot_img
  • సాయిపూర్ కు మాత్రమే చైర్మన్ కాదు 36 వార్డులకు చైర్మన్..
  • వార్డుకు 200 ఇండ్లు ఇచ్చి తీరాలి…
  • అభివృద్ధి చేసి చూపిస్తానన్నావ్, చేసి చూపించు…!
  •  నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
  •  నీ మైండ్ లో నర్సింలును కాదు, అభివృద్ధిని పెట్టుకో.
  • నాకు ఇంక వేరే పని లేదు.. ని వెంటనే పడ్తా…..! 
  • బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : బాల్ రెడ్డి కాదు నువ్వు బాలరాజు… అంటూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పై బిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు విమర్శలు చేశారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… కేవలం సాయిపూర్ కు మాత్రమే చైర్మన్ కాదు, తాండూరు పట్టణంలోని 36 వార్డులకు చైర్మన్ అన్నారు. పట్టణం అభివృద్ధి చేస్తే ఊరు వదిలేసిన వెళ్ళిపోతారు అని ఛాలెంజ్ చేశారు. చేయండి అభివృద్ధి చేసి చూపించండి అంటూ…ప్రస్తుత తాండూరు ప్రథమ పౌరురాలు నీరజ కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అంటూ మాట్లాడుతున్న మీరు గతంలో ఏ పార్టీ నుండి కౌన్సిలర్ గా గెలిచారు గుర్తు చేసుకోవాలన్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉండి నాపైన మీరు ఓటమిపాలైన విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. నన్ను పదవ వార్డులో ఓడించేందుకు, వార్డుకు 200 ఇండ్లు, ఇస్తామన్నారు అవి ఇచ్చేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఘాటుగా విమర్శించారు. సాయిపూర్ నర్సింలు అంటూ రోజు మీ మైండ్ లో నా గురించి ఆలోచించడం మానేసి, మీకు వచ్చిన అవకాశం ను సద్వినియోగం చేసుకోండి. చాలెంజ్ చేసినట్టుగానే అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ప్రస్తుతం నేను ఖాళీగా ఉన్నాను నాకు పని ఏం లేదు… మీరేం చేశారో అన్ని బైటికి తియ్యడమే నా పని అంటూ మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము నిద్రపోము మిమ్మల్ని నిద్రపోనివ్వము అంటూ… చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories