
- బాలాజీ ఎలక్ట్రానిక్స్ ‘ఫెస్టివల్ బొనాంజా’ లక్కీ డ్రా విజేతల ప్రకటన
- మొదటి రెండు బహుమతులుగా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. మూడో బహుమతి వాషింగ్ మిషన్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ‘బాలాజీ ఎలక్ట్రానిక్స్’ గత సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు నిర్వహించిన ‘ఫెస్టివల్ బొనాంజా’ లక్కీ డ్రా విజేతలను గురువారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై కూపన్లను తీశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యాపారంలో లాభాల కంటే వినియోగదారుల నమ్మకం సంపాదించుకోవడం ముఖ్యమని, ఆ విషయంలో బాలాజీ ఎలక్ట్రానిక్స్ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తోందని కొనియాడారు. ప్రజలకు అవసరమైన నాణ్యమైన ఎలక్ట్రానిక్ వస్తువులను అందుబాటులోకి తేవడంతో పాటు, ఇలాంటి బహుమతుల ద్వారా వినియోగదారుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారని ప్రశంసించారు.లక్కీ డ్రాలో భాగంగా మొదటి మరియు రెండవ బహుమతులుగా ఎలక్ట్రిక్ స్కూటర్లను, మూడవ బహుమతిగా వాషింగ్ మిషన్ ను విజేతలకు కేటాయించారు. డ్రాలో పేరు వచ్చిన విజేతలకు నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. విజేతలుగా నిలిచినా వారు…. మొదటి మహుమతి కూపన్ నెంబర్ 0181 తలారి నరేష్, రెండవ బహుమతి కూపన్ నెంబర్ 0926 ఎం. శ్రీకాంత్, మూడవ బహుమతి కూపన్ నెంబర్ 0994 మణెమ్మ లు విజేతలుగా నిలిచారు. బాలాజీ ఎలక్ట్రానిక్స్ అధినేత శ్రీకాంత్ మాట్లాడుతూ.. తమ షోరూమ్‌ను ఆదరిస్తున్న తాండూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వినియోగదారుల సంతృప్తియే తమ ప్రథమ ప్రాధాన్యతని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన ఆఫర్లతో సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.




