ప్రార్థన కూటమి ఏర్పాటు..!

- మెథడిస్ట్ సెంట్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన ఆరాధన కూటమి
- క్రైస్తవులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన లే లీడర్ ఏసు దాస్, సంఘ పెద్దలు టి పాల్
- క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన డిఎస్ కోట్రికా జనార్దన్
జనవాహిని ప్రతినిధి : ఈనెల 25న జరుగనున్న క్రిస్టమస్ పండుగ ఏసుక్రీస్తు ప్రభువు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని పాస్టర్ల కుటుంబాలకు క్రిస్టమస్ కానుక అందజేసిన బిఎస్ జనార్ధన్. తాండూరు పట్టణంలోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చి లే లీడర్ ఏసు దాస్, సంఘ పెద్దలు టి పాల్ ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండూరు మెథడిస్ట్ సెంట్రల్ చర్చి డిఎస్ కోట్రిక జనార్ధన్ హాజరయ్యారు. అనంతరం మెథడిస్ట్ సెంట్రల్ చర్చి లో ప్రత్యేక ఆరాధన కార్యక్రమం మరియు పాటలు, ప్రార్థనలు నిర్వహించారు. మంగళవారం రోజు పట్టణంలోని మెథడిస్ట్ సెంట్రల్ చర్చి పాటు గ్రామాల పరిధిలో సేవలందిస్తున్న పాస్టర్ల కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలను కానుకలుగా అందజేశారు. అనంతరం తాండూరు మెథడిస్ట్ సెంట్రల్ చర్చి లే లీడర్ ఏసుదాస్, మాట్లాడుతూ ప్రతి సంఘ సభ్యులు ఏసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్యలో భాగస్వాములుగా ఉండి అనేక సంఘాలలో సేవలు అందిస్తున్న దైవ సేవకులకు తన వంతుగా క్రిస్టమస్ కానుకలను అందజేయడం జరిగిందన్నారు. అలాగే సంఘ పెద్దలు టి పాల్ దైవ సేవకుల కుటుంబ సభ్యులకు బ్లాంకెట్స్ ను కానుకలుగా అందజేశారని చెప్పారు. దేవుని పరిచర్యలో అంచలంచలుగా ఎదగాలని ఏసు క్రీస్తు ప్రభువు వారికి ప్రత్యేక ప్రార్థన చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం డిఎస్ మాట్లాడుతూ ఈనెల 25న జరగనున్న క్రిస్టమస్ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో శాంతియుతంగా ఏసుక్రీస్తు ప్రభువు వారి జన్మదిన వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పాస్టర్ల కుటుంబ సభ్యులకు క్రిస్టమస్ కానుకలను అందజేసిన లే లీడర్ ఏసుదాసు, సంఘ పెద్దలు టి పాల్ ను అభినందించారు. అలాగే తాండూరు డిస్టిక్ పరిధిలోని క్రైస్తవులందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధైవ సేవకులు రెవ అబ్రహం,రెవ, పి భాస్కర్, రెవ సమృద్ధి, ప్రతాప్ సింగ్,అశోక్ రాజ్, సీనియర్ జర్నలిస్ట్ సైమన్, వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు, విశ్రాంత ఉద్యోగులు, సంఘ పెద్దలు,మహిళలు, యవనస్తులు, పాల్గొన్నారు.



