ప్రాణం తీసిన ప్రేమ వివాహం..!

- అత్త వేధింపులకు కోడలు బలి?
- ఎనిమిది నెలల ముచ్చట.. అంతలోనే అనంతలోకాలకు!
- కలలు కన్న కాపురం.. కడతేరిన ప్రాణం!
- అత్త వేధింపులే అనూష మృతికి కారణమా?
జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రేమించి పెళ్లాడిన ఆ యువతి ఎన్నో కలలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. కానీ, ఆ ప్రేమ వివాహం అత్తకు నచ్చలేదు. పెళ్లయిన నాటి నుంచే వేధింపులు మొదలయ్యాయి. చివరకు పెళ్లయిన ఎనిమిది నెలలకే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే…తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన పరమేష్ , అనూష అనే యువతీ యువకులు గత ఎనిమిది నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం పరమేష్ల్లి కి ఇష్టం లేదు. తన కొడుకు ప్రేమ పెళ్లి చేసుకున్నాడనే కోపంతో, అత్త మొదటి నుంచి అనూషపై ద్వేషం పెంచుకుంది. నిత్యం అసభ్య పదజాలంతో దూషిస్తూ, మానసికంగా మరియు శారీరకంగా వేధించేదని సమాచారం.పుట్టింటికి వెళ్లినా వదలని గొడవలు గత నాలుగు రోజులుగా వీరి కుటుంబంలో గొడవలు తీవ్రమయ్యాయి. అత్త వేధింపులు భరించలేక అనూష తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, భర్త పరమేష్అ క్కడికి వెళ్లి, సర్దిచెప్పి మళ్ళీ తన ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే అనూష మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది.తమ బిడ్డను అత్తామామలే కొట్టి చంపేశారని అనూష కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. “నా చెల్లిని అకారణంగా వేధించేవారు. గొడవల వల్ల ఇంటికి వస్తే, భర్తను నమ్మి తీసుకువెళ్లాడు.. ఇంతలోనే తనను ప్రాణాల్లేకుండా చేశారు” అని అనూష అన్న కన్నీరు మున్నీరయ్యారు. అనూష మృతికి గల అసలు కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాత తెలియనున్నాయి.



