Thursday, March 12, 2026
spot_img

పోలీస్ స్టేషన్ ముందే ‘అడ్డగోలు’ పార్కింగ్..!

-

spot_img
spot_img
  • పోలీస్ స్టేషన్ ముందే ‘ట్రాఫిక్’ కష్టాలు…! 
  • ఆర్టీసీ బస్సు – కారు ఢీ
  •  ఇందిరా చౌక్ వద్ద అడ్డగోలు పార్కింగ్‌తో వాహనదారుల అవస్థలు –
  • పట్టించుకోని అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
  • ఎలా జరిగిందో కింద వీడియో లో చూడండి..! 

జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ఇందిరా చౌక్ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు గాలికి ఎగురుతున్నాయి. ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే అడ్డగోలుగా వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తాజాగా సోమవారం స్టేషన్ ఎదురుగా నిలిపి ఉన్న ఒక కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ, కారు పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు.ప్రధాన కూడలి అయిన ఇందిరా చౌక్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందే సగం రోడ్డు వరకు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ప్రైవేటు కార్లు ఇష్టానుసారంగా నిలుపుతున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణికుల కోసం రోడ్డు పైనే ఆగుతుండటంతో మిగిలిన వాహనాలు వెళ్లడానికి దారి లేకుండా పోతోంది.పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇలాంటి అస్తవ్యస్థ పరిస్థితులు ఉండటంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన స్టేషన్ ముందే నిబంధనలు ఉల్లంఘిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?” అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.రోడ్డును ఆక్రమిస్తూ నిలుపుతున్న వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందిని,ఆర్టీసీ బస్సులు సరైన వే లో కాకుండా రోడ్డు మధ్యలో ఆపడం వల్ల వెనుక వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి.స్టేషన్ ఎదురుగా ఉన్న వాహనాలను తొలగించడంలో పోలీసులు చొరవ చూపకపోవడం.తక్షణమే అధికారులు స్పందించి, ఇందిరా చౌక్ వద్ద పార్కింగ్‌ను అరికట్టాలని, ట్రాఫిక్ మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని తాండూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories