Thursday, February 5, 2026
Home NEWS పట్లోళ్ల చైతన్య ప్రశాంత్ కు పెరుగుతున్న ప్రజధారణ….! 

పట్లోళ్ల చైతన్య ప్రశాంత్ కు పెరుగుతున్న ప్రజధారణ….! 

0
8
  • దీటైనా మాటలతో తనదైన శైలితో దూసుకుపోతున్న బిటెక్ విద్యావంతురాలు….
  • తాండూర్ ‘9వ వార్డు’లో హోరాహోరీ..!
  •  అనూహ్యంగా పుంజుకుంటున్న హస్తం అభ్యర్థి  పట్లోళ్ల చైతన్య ప్రశాంత్
  • ​బీజేపీ నామినేషన్ ఉపసంహరణతో మారుతున్న సమీకరణాలు
  • ​సాయిపూర్‌లో హీట్ పెంచుతున్న మున్సిపల్ రాజకీయం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో 9వ వార్డు రాజకీయం సరికొత్త మలుపు తిరుగుతోంది. మున్సిపాలిటీలోనే అత్యంత కీలకమైన ఈ వార్డులో గత మూడు పర్యాయాలుగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సిట్టింగ్ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సిములు,కోటకు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి చైతన్య ప్రశాంత్ గట్టి పోటీనిస్తున్నారు. స్థానికంగా నెలకొన్న రాజకీయ సమీకరణాలు, అనూహ్య పరిణామాలు   పట్లోళ్ల   చైతన్య ప్రశాంత్‌కు అనుకూలంగా మారుతుండటంతో సాయిపూర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.గత 15 ఏళ్లుగా వార్డులో అధికారంలో ఉన్న పట్లోళ్ల నర్సిములుపై సహజంగానే కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ‘యాంటీ ఇంకంబెన్సీ’ని గమనించిన కాంగ్రెస్ అభ్యర్థి    పట్లోళ్ల    చైతన్య ప్రశాంత్, చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అసంతృప్త ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో ఆయన సఫలీకృతం అవుతున్నట్లు తెలుస్తోంది.దీటైనా మాటలతో తనదైన శైలితో ఎన్నికల ప్రచారం లో అభ్యర్థి బిటెక్ విద్యావంతురాలు     పట్లోళ్ల      చైతన్య ప్రశాంత్   దూసుకుపోతుంది. వీరికి స్థానిక ప్రజధారణ పెరిగిపోతుండడం తో 9వ వార్డ్ లో గెలుపు పక్క అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా యువత, అభివృద్ధిని కోరుకునే వర్గాలు  పెట్లోళ్ళ          చైతన్య ప్రశాంత్   వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్డులో టాక్ వినిపిస్తోంది.నిన్నటి వరకు త్రిముఖ పోటీగా ఉన్న ఈ వార్డులో నిన్న జరిగిన కీలక పరిణామం     పట్లోళ్ల    చైతన్య ప్రశాంత్‌కు పెద్ద ఊరటనిచ్చింది.    పట్లోళ్ల  చైతన్య ప్రశాంత్ గెలుపు కోసం తమ కుటుంబ సభ్యులు    పట్లోళ్ల నర్సిములు ,పట్లోళ్ల వెంకటయ్య పట్లోళ్ల సాయి రెడ్డి, పట్లోళ్ల రాఘవేంద్ర రెడ్డి,  పట్లోళ్ల ప్రశాంత్   లు రంగం లోకి దిగారు. బీజేపీ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో, ఆ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఇప్పుడు కీలకంగా మారింది. సమాచారం ప్రకారం.. బీజేపీ సానుభూతిపరులు, కార్యకర్తలు సిట్టింగ్ అభ్యర్థిని కాదని, మార్పు కోరుతూ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక జరిగితే కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి 9వ వార్డులో పోటీ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోంది. ఒకవైపు సుదీర్ఘ అనుభవం, బలమైన క్యాడర్ ఉన్న పట్లోళ్ల నర్సిములు.. మరోవైపు మార్పు లక్ష్యంగా దూసుకుపోతున్న     పెట్లోళ్ళ  చైతన్య ప్రశాంత్. ఇప్పటి వరకు శాంతంగా ఉన్న సాయిపూర్ వీధులు ఎన్నికల ప్రచారంతో హోరెత్తుతున్నాయి. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కూడా ముదురుతోంది.    అయితే స్థానికంగా పట్లోళ్ల నర్సిములు కంచు కోటకు బీటలు పారనుందని తెలుస్తుంది.   మొత్తానికి బీజేపీ ఓటు బ్యాంకు ఎటు మళ్లుతుంది?   పట్లోళ్ల     చైతన్య ప్రశాంత్ ఆశిస్తున్న మార్పు వస్తుందా? లేదా పట్లోళ్ల మళ్లీ తన స్థానాన్ని కాపాడుకుంటారా? అనేది తేలాలంటే పోలింగ్ వరకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here