
- 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్
- అధికారులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన వెంకట్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారo పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, డైరెక్టర్ నిర్మలారెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పివిఆర్ మాట్లాడుతూ తాండూరు ప్రాంత ప్రజలకు, పాలకులకు, అధికారులకు, అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య విద్యార్థులచే అసాధారణ ఫలితాలను సాధించడం తమ లక్ష్యం అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉన్నారు.



