Tuesday, February 17, 2026

నమ్మించి గొంతు కోశారు.. .!

-

spot_img
  • నమ్మించి గొంతు కోశారు.. 
  • సొంత పార్టీ నేతలే నన్ను ముంచారు
  • బీఆర్ఎస్ యువ నేత ఎబినైజర్ కన్నీటి పర్యంతం

జనవాహిని ప్రతినిధి తాండూరు : నేను అమ్ముడుపోలేదు.. నన్ను నమ్మించి మోసం చేశారు. పార్టీ కోసం, రోహిత్ రెడ్డి గెలుపు కోసం రాత్రింబగళ్లు కష్టపడితే, చివరకు నాకు వెన్నుపోటు పొడిచారు. అంటూ తాండూరు కు చెందిన మాజీ బీఆర్ఎస్ యువ నాయకుడు జోగులా ఎబినైజర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సొంత పార్టీ నేతలే తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకున్నారని ఆయన బహిరంగంగా ఆరోపించారు.గత కొంతకాలంగా పట్టణం లో యువతను ఏకం చేస్తూ, పార్టీ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎబినైజర్ కీలక పాత్ర పోషించిన్నట్లు తెలిపారు. 2వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు నమ్మబలికారని,అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తీరా సమయం వచ్చాక తనను పక్కన పెట్టి వెన్నుపోటు పొడిచారని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలే లోపాయికారీగా వేరే పార్టీ అంటే బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని, ఇది ముమ్మాటికీ ద్రోహమేనని ఎబినైజర్ పేర్కొన్నారు.పదవులు అనుభవిస్తున్న పెద్ద నాయకులు, క్షేత్రస్థాయిలో కష్టపడే చిన్న స్థాయి కార్యకర్తల జీవితాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు.సొంత పార్టీ నేతల అసమ్మతి, వెన్నుపోటు రాజకీయాల వల్లే 2వ వార్డులో బీఆర్ఎస్ మద్దతు ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థి ఓటమి చెందాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.పార్టీని నమ్ముకున్న యువతకు ఈ నాయకులు ఇచ్చే గౌరవం ఇదేనా?” అని ఎబినైజర్ ప్రశ్నించారు.ఈ ఘటన తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం ప్రాణాలొడ్డి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేకపోగా, ఇలాంటి మోసాలకు గురికావడంపై స్థానిక యువతలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఎబినైజర్ పేర్కొన్నారు. తనపై వస్తున్నా వార్తలాన్ని అవస్తవం అని తను ఎవరికీ అమ్ముడుపోలేదని ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories