- నాణ్యత లేని భోజనం తిరస్కరణ!
- నాణ్యత లేని భోజనంపై అధికారుల అసహనం.
- భోజనం బాగాలేదని తినకుండానే వెనుదిరిగిన ఎన్నికల అధికారులు.
తాండూర్ జనవాహిని ప్రతినిధి: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో బుధవారం నామినేషన్ ల ప్రక్రియ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా నామినేషన్ల స్వీకరణ విధుల్లో నిమగ్నమైన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం మధ్యాహ్నం అధికారులకు వడ్డించిన భోజనం అత్యంత నాసిరకంగా ఉండటంతో, వారు తినడానికి నిరాకరించి అక్కడి నుంచి వెనుదిరిగారు.ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు హాజరైన రిటర్నింగ్ అధికారులు , సహాయ రిటర్నింగ్ అధికారులు మరియు ఇతర సిబ్బంది కోసం మున్సిపల్ యంత్రాంగం మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసింది. అయితే, వడ్డించిన భోజనం నాణ్యత ఏమాత్రం బాలేదని, అన్నం సరిగ్గా ఉడకలేదని మరియు కూరలు రుచిగా లేవని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.వడ్డించిన భోజనం నాణ్యతపై అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.కనీస సౌకర్యాలు కల్పించడంలో మరియు నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు.భోజనాన్ని ముట్టుకోకుండానే అధికారులు విధులకు వెనుదిరిగారు, మరికొందరు బయట హోటళ్లలో భోజనం చేయాల్సి వచ్చింది.ఎన్నికల వంటి కీలక సమయాల్లో విధుల్లో ఉండే సిబ్బందికి పౌష్టిక ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇలాంటి నిర్లక్ష్యం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.






