
- 48 మందికి రూ. 74 వేల జరిమానా
- కోర్టు మెట్లెక్కిన 48 మంది వాహనదారులు
- తాగి వాహనం నడిపితే జరిమానా తప్పదు: సీఐ సంతోష్ కుమార్ హెచ్చరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై న్యాయస్థానం కఠినంగా వ్యవహరించింది. సోమవారం పట్టణ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన 48 మంది వాహనదారులకు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ నరేందర్ మొత్తం రూ. 74,000/- జరిమానా విధించారు.ఈ సందర్భంగా తాండూరు పట్టణ సీఐ జి. సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, శాంతిభద్రతల పరిరక్షణకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు బలి అవుతున్నాయని, ఇటువంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని, డ్రైవింగ్ చేసే సమయంలో మద్యం సేవించకూడదని ఆయన సూచించారు. జరిమానాలతో పాటు నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.



