- అంతర్గత రహదారులకు రూ.6.12 కోట్లు మంజూరు
- నాణ్యతతో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ నియోజకవర్గంలోని పల్లెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 6.12 కోట్లు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా…..కొత్తగా మంజూరైన రహదారి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడితేనే రవాణా వ్యవస్థ సులభతరం అవుతుందని, ప్రజల ఇబ్బందులు తొలగుతాయని ఆయన పేర్కొన్నారు.2025-26 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే రూ.14.20 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా నూతన గ్రామ పంచాయతీ భవనాలుఅంగన్‌వాడీ కేంద్రాలు, మహిళా సమాఖ్య భవనాలుప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలుఈ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.తాండూర్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు దాదాపు రూ.20.3 కోట్లు మంజూరయ్యాయని, మరో రూ.1.50 కోట్లు త్వరలోనే విడుదల కానున్నాయని హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.



