NEWS
తాండూరు డీఎస్పీ కీలక ఆదేశాలు..!

- నేరాల నియంత్రణపై దృష్టి,
- పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం
- డిఎస్పీ నర్సింగ్ యాదయ్య
తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మంగళవారం నాడు పెద్దేముల్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు నిరంతరం ప్రజలతో మమేకమై నేరాల నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని డీఎస్పీ నొక్కి చెప్పారు.పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన ఆదేశించారు.ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.



