తాండూరులో ఆధ్యాత్మిక పరిమళం..!

- ఇందిరానగర్ శ్రీరామ మందిర పునర్నిర్మాణానికి దాతల విరాళాలు
- ఆలయ తలుపుల వితరణ.. నగదు విరాళాల అందజేత
- దాతల సహకారంతో రూపుదిద్దుకుంటున్న శ్రీరామ మందిరం
- దాతలు ముందుకు రావాలని కమిటీ విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో జరుగుతున్న శ్రీరామ మందిర పునర్నిర్మాణ పనులకు భక్తులు, వ్యాపారవేత్తలు సహకారం అందిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పలువురు దాతలు తమ వంతుగా భక్తిపూర్వక విరాళాలను అందజేశారు.ఆలయ అంతరాలయానికి అవసరమైన తలుపులను గుబ్బ వీరేశం అందజేయగా, ఆలయ ప్రధాన ద్వారపు తలుపులను కే. రఘు చారి విరాళంగా సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అదేవిదంగా శ్రీ వినాయక మెడికల్ ఏజెన్సీస్ అధినేత రాజశేఖర్ రూ. 15,101/- విరాళంగా అందించారు. అదేవిధంగా, చల్ల ప్రభాకర్రూ. 11,000/- నగదును ఆలయ నిర్మాణ కమిటీకి అందజేశారు.దేవాలయ పునర్నిర్మాణం లాంటి పుణ్యకార్యంలో భాగస్వాములైన దాతలను కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సహకారంతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు కమిటీ పేర్కొంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు భక్తులు తమవంతు సహకారం అందించాలని, దాతలు ముందుకు వచ్చి ఆలయం అభివృద్ధి తోడ్పాటునివ్వాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.





