గ్రామ స్వరాజ్యం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలి

- గెలుపొందిన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే సన్మానం
- అభివృద్ధికి సహకరించాలి పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపు
- బీఆర్ఎస్ బలంతో తాండూరు సర్పంచ్‌ల గెలుపు
- సర్పంచ్‌లను సన్మానించిన రోహిత్ రెడ్డి
- రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో విజయం సాధించిన సర్పంచ్ అభ్యర్థులు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి గెలుపొందిన సర్పంచ్‌లు రోహిత్ రెడ్డి నివాసానికి చేరుకొని చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని పూర్తిగా వినియోగించుకుని, నవశకం దిశగా గ్రామాలను అభివృద్ధి చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం గెలుపొందిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. పార్టీ తరఫున ఎల్లప్పుడూ సర్పంచ్‌లకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
బిఆర్ఎస్ గెలుపొందిన పంచాయతీలు..
బషీరాబాద్ మండలం పర్వతపల్లి, కుప్పనకోట్, కొర్విచేడ్, కొర్విచేడ్ గని, మల్కన్ గిరి, దామర్ చేడ్, కోత్లాపూర్, క్యాద్గిరా, ఇందరచెడ్, గంగ్వార్, అల్లాపూర్, కమసానపల్లి , నవల్గా, గొటిగాకలాన్, మంతటి, కుప్పనకోట్, నీళ్లపల్లి, జమ్లానాయక్ తాండా, నంద్యానాయక్ తాండా.
తాండూరు మండలం…
కోటబాసుపల్లి, మిట్టబాసుపల్లి, చింతామణిపట్నం, జిన్గుర్తి, కొత్లాపూర్, సంగెంకలాన్, సిరిగిరిపేట్, పర్వతాపూర్, బెల్కటూర్, అల్లాపూర్.
యాలాల మండలం….
ఎన్కేపల్లి, పేర్కంపల్లి, దౌలాపూర్, రాఘవాపూర్, నాగసముందర్, దేవనూర్, గోరెపల్లి, పేర్కంపల్లి తాండా, ముకుందాపూర్.
పెద్దేముల్ మండలం….
పెద్దేముల్, రుక్మాపూర్, పాషాపూర్, ఊరెంటితాండా, ఎర్రగడ్డతాండా, బుద్ధారం, బాయిమీది తాండా, మంబాపూర్. ఈ గ్రామ పంచాయతీలలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్ లతో రోహిత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడుతూ…. రానున్న జడ్పీటీసీ ఎన్నికల్లో మన బలం ఏంటో చూపించాలని, అందరికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.



