గాజీపూర్ ఫలితాలపై తీన్మార్ ఫైట్…!

- గాజీపూర్ సర్పంచ్ అభ్యర్థికి ‘తీన్మార్ మల్లన్న’ భరోసా..!
- బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే సహించం
- గాజీపూర్ ఫలితాలపై విచారణ జరపాలి
- ఎలక్షన్ కమిషన్‌కు మల్లన్న లేఖ.

జనవాహిని ప్రతినిధి తాండూరు : పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి తలారి సుశీల వీరప్పకు ఎమ్మెల్సీ, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న పూర్తి మద్దతు ప్రకటించారు. ఒక బీసీ బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.గాజీపూర్ ఎన్నికల ఫలితాల ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ తీన్మార్ మల్లన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి గెలిచే అభ్యర్థులను అక్రమ మార్గాల్లో ఓడించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు.
సర్పంచ్ అభ్యర్థి సుశీల వీరప్పకు జరిగిన అన్యాయంపై వెనక్కి తగ్గేదే లేదని, బాధితులకు న్యాయం జరిగే వరకు క్యూ న్యూస్ మరియు వ్యక్తిగతంగా తాను అండగా ఉంటానని మల్లన్న స్పష్టం చేశారు. అధికారుల తీరుపై విచారణ జరిపి, అసలైన విజేతకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



