ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ ఎంపికలు

- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల క్రీడాకారిణులకు అద్భుత అవకాశం
- ఈ నెల 6న తాండూరులో సెలెక్షన్స్
జనవాహిని తాండూరు ప్రతినిధి : తాండూరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మహిళలు, బాలికలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్ షూటింగ్ బాల్ ఎంపికలను ఈ నెల 6వ తేదీ (శనివారం) తాండూరు పట్టణంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.వికారాబాద్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాములు పర్యవేక్షణలో ఈ ఎంపిక కార్యక్రమం జరుగుతుందని ఉమ్మడి జిల్లా చైర్మన్ కె. ఆంజనేయులు, అధ్యక్ష కార్యదర్శులు రాములు, చంద్రమోహన్ తెలియజేశారు. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చు.షూటింగ్ బాల్ క్రీడల్లో ఆసక్తిగల మహిళలు, బాలికలు తమ బోనఫైడ్ మరియు ఆధార్ కార్డుతో హాజరుకావాలి.ఈ నెల 6వ తేదీ, శనివారం ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణ కేంద్రం లోని సెంట్ మర్క్స్ హై స్కూల్ లో నిర్వహిస్తున్నారు. ఈ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఎంపికైన వారు ఈ నెల 13, 14 తేదీలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షూటింగ్ బాల్ ఆధ్వర్యంలో తాండూరులోనే నిర్వహించే రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొంటారు.మరిన్ని వివరాల కోసం క్రీడాకారులు వికారాబాద్ జిల్లా షూటింగ్ బాల్ ప్రధాన కార్యదర్శి రాములు, ఆర్గనైజింగ్ కార్యదర్శి అంజి, వ్యాయామ ఉపాధ్యాయులు J. శరణు కుమార్ లేదా సీనియర్ క్రీడాకారులు మొయిజ్ లను సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.సంప్రదించాల్సిన నెంబర్లు: 9951343432, 9989984017, 8074240517, 8688809548.



