Wednesday, March 25, 2026

కౌన్సిలర్ల విన్నపానికి చైర్‌పర్సన్ గ్రీన్ సిగ్నల్…!

-

spot_img
spot_img
spot_img
  • మున్సిపల్ చైర్‌పర్సన్ చొరవ..
  • ఎస్సీ స్మశాన వాటిక శుభ్రం 
  • ప్రజా సమస్యపై మెరుపు వేగంతో స్పందన
  • కృతజ్ఞతలు తెలిపిన వార్డ్ ప్రజలు 

జనవాహిని ప్రతినిధి తాండూరు : వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాండూరు మున్సిపాలిటీ అడుగులు వేస్తోంది. పట్టణంలోని 15, 19 వార్డులకు చెందిన ఎస్సీ స్మశాన వాటిక గత కొంతకాలంగా పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఈ విషయాన్ని గమనించిన 19వ వార్డు కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్, 15వ వార్డు కౌన్సిలర్ దివిటీ ఎల్లప్పలు సమస్య పరిష్కారానికి పూనుకున్నారు.స్మశాన వాటిక దుస్థితిని కౌన్సిలర్లు ఫోన్ ద్వారా మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డికి వివరించారు. దీనిపై ఆమె తక్షణమే స్పందించి, పారిశుద్ధ్య విభాగం అధికారులను ఆదేశించి వెంటనే జేసీబీ యంత్రాలను అక్కడికి పంపించారు.చైర్‌పర్సన్ పంపిన జేసీబీలతో కౌన్సిలర్లు స్వయంగా దగ్గరుండి స్మశాన వాటికను శుభ్రం చేయించారు. పిచ్చిమొక్కలను తొలగించి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా క్లీన్ చేయించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను చెప్పగానే సానుకూలంగా స్పందించిన చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డికి, నిరంతరం అందుబాటులో ఉంటూ పనులు చేయిస్తున్న కౌన్సిలర్లకు వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

FOLLOW US

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Related Stories