NEWS
కొత్త సర్పంచులకు శుభాకాంక్షలు..!

- అభినందించింది మాజీ ఎమ్మెల్యే
- శాలువాతో సర్పంచ్స లకు న్మానం
- గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలనీ సూచన

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాజాగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించిన పలువురు నూతన సర్పంచులు గురువారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలిపి, శాలువాలతో సన్మానించారు.బషీరాబాద్ మండలం కొర్విచెడ్ గ్రామ సర్పంచ్గా గెలుపొందిన వడ్డే శరణమ్మ,పెద్దేముల్ మండలం రుకమాపూర్ గ్రామ సర్పంచ్గా గెలుపొందిన బాలరాజ్, తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన చెనప్ప లు రోహిత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి నూతన సర్పంచులకు సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.



